ముహూర్తం షాట్ కు సిద్ధమవుతున్న ‘శేఖర్ కమ్ముల’ చిత్రం

sekhar-kammula
ఆనంద్, హ్యాపీ డేస్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యువతకు బాగా దగ్గరైన దర్శకుడు ‘శేఖర్ కమ్ముల’. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో కొత్తదనంతో సంచలనాలు సృష్టించిన ఆయన చివరగా 2014లో ‘అనామిక’ చిత్రం తరువాత ఇప్పటివరకూ మరో సినిమా తీయలేదు. ఇంతగా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన ప్రస్తుతం నాగబాబు తనయుడు, మెగాహీరో ‘వరుణ్ తేజ్’ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

చిత్రానికి సంబంధించిన కథ పరమైన చర్చలు సైతం పూర్తైనట్టు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ నిర్మాత ‘దిల్ రాజు’ నిర్మిస్తున్నఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన ప్రేమమ్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటి ‘సాయి పల్లవి’ నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రానికి సంబందించిన ముహూర్తం షాట్ ను ఆగష్టు 5న జరిపి అదే రోజున టైటిల్ ను సైతం ప్రకటించనున్నారు.