రాజశేఖర్ “శేఖర్” సెకండ్ సింగిల్ “కిన్నెర”కి టైం ఫిక్స్..!

రాజశేఖర్ “శేఖర్” సెకండ్ సింగిల్ “కిన్నెర”కి టైం ఫిక్స్..!

Published on Feb 1, 2022 10:00 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “శేఖర్”. మలయాళంలో సూపర్ హిట్టైన క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘జోసెఫ్‌’కు ఇది రీమేక్‌. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆత్మీయ రజన్, ముస్కాన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, ఫస్ట్ సింగిల్ “లవ్ గంటే మోగిందంట”కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ “కిన్నెర” రిలీజ్‌కి కూడా టైం ఫిక్స్ అయ్యింది. ఫిబ్రవరి 04వ తేది ఉదయం 10:00 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇకపోతే విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు