
నందమూరి కళ్యాణ్ రామ్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందులో ఒక దానికి ‘షేర్’ అనే పవర్ఫుల్ టైటిల్ ని పెట్టారు. గతంలో కళ్యాణ్ రామ్ ‘కత్తి’ సినిమాకి దర్శకత్వం వహించిన మల్లి కార్జున్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్లో మొదలవుతోంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ ఎపిసోడ్ ని కూడా షూట్ చేయనున్నారు.
కళ్యాణ్ రామ్ సరసన వన్య మిశ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కాకుండా ‘పటాస్’ సినిమాని కూడా ఒకే సమయంలో పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘పటాస్’ లో శృతి సోది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లో పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్న కళ్యాణ్ రామ్ ఈ రెండు సినిమాలను వరుసగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.