ఆస్తులు మాత్రమే రాశాడు.. విడాకులు ఇవ్వడం లేదు !

Published on Feb 6, 2022 8:37 pm IST


బాలీవుడ్‌ మాజీ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రా గతేడాది అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్‌ పై విడుదల అయిన రాజ్‌ కుంద్రాకి శిల్పా విడాకులు ఇవ్వబోతుంది అంటూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన పేరుపై ఉన్న ఆస్తులను రాజ్‌కుంద్రా తన భార్య శిల్పాశెట్టి పేరు మీదకు మార్చాడు అని కూడా ప్రచారం జరుగుతుంది.

అయితే, ఈ వార్తల పై ఎలాంటి క్లారిటీ లేదు. అసలు ఉన్నట్టు ఉండి ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు రాజ్‌ కుంద్రా ఎందుకు మార్చాడు ? దీనికి కారణం ఏమై ఉంటుంది ? అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. అయితే, తన పేరు మీద ఉన్న ఆస్తులు వివాదం లోకి వెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి.. రాజ్‌ కుంద్రా ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చాడు అని తెలుస్తోంది. అంతేగాని, ఈ జంట విడాకులకు సిద్ధమైందనే వార్తలో మాత్రం వాస్తవం లేదట.

సంబంధిత సమాచారం :