నన్ను చాలా బాధించింది – శిల్పాశెట్టి

Published on Nov 15, 2021 6:11 pm IST

శిల్పాశెట్టి భర్త ‘రాజ్ కుంద్రా’ అశ్లీల చిత్రాల రూపకల్పనలో అడ్డంగా బుక్ అయిన దగ్గర నుంచి శిల్పా శెట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికితోడు రాజ్‌ కుంద్రా దంపతుల పై ఒక వ్యాపారవేత్త చీటింగ్ కేసు పెట్టి ఫోర్జరీ ఆరోపణలు చేశాడు. తాజాగా శిల్పా శెట్టి ఈ ఆరోపణల పై స్పందిస్తూ.. ‘నా భర్త రాజ్‌ పై, అలాగే నా పేరు మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైందన్న వార్త నుంచి మేము ఇప్పుడే తేరుకుంటున్నాము.

ఇది నాకు చాలా షాకింగ్‌గా ఉంది. కాషిఫ్‌ ఖాన్‌ దేశవ్యాప్తంగా ఎఎస్‌ఎఫ్ఎల్‌ ఫిట్‌నెస్‌ జిమ్‌లను తెరవడానికి బ్రాండ్‌ ఎస్‌ఎఫ్‌ఎల్‌ పేరుతో హక‍్కులు తీసుకున్నాడు. అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని, బ్యాంకింగ్‌, రోజువారీ వ్యవహారాలలో అతను సంతకం చేశాడు. అసలు అతని లావాదేవీల గురించి మాకు తెలియదు’ అని శిల్పా శెట్టి ట్వీట్‌ చేశారు.

‘గత 28 ఏళ్లుగా నేను ఎన్నో కష్టాలు పడి నాకంటూ ఒక పేరు తెచ్చుకున్నాను. నా ప్రతిష్ట దెబ్బతీసి నన్ను ఇబ్బందుల్లోకి లాగడం నన్ను చాలా బాదించింది’ అని కూడా శిల్పా శెట్టి ట్విటర్‌లో రాసుకొచ్చింది.

సంబంధిత సమాచారం :