వైరల్ అవుతున్న శిల్పాశెట్టి మెసేజ్ !

Published on Sep 19, 2021 10:40 pm IST

శిల్పాశెట్టి.. పేరుకు తగ్గట్టుగానే ఒక శిల్పిలా తన శరీర సౌష్ఠవంతో ఎందరో అభిమానులను సంపాధించుకుంది. కానీ ఆమె భర్త ‘రాజ్ కుంద్రా’ అశ్లీల చిత్రాల రూపకల్పనలో అడ్డంగా బుక్ అవ్వడంతో.. ఇక అప్పటి నుంచి శిల్పా శెట్టి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అయితే రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల బిజినెస్ చేస్తున్న సంగతి తనకు తెలియదు అని చెప్పడానికి, ఆ విషయాన్ని నమ్మించడానికి గత కొన్ని రోజులుగా ఆమె చాలా కష్టపడుతుంది.

ఈ క్రమంలో తన భర్త రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి విడాకులు కూడా ఇవ్వడానికి సిద్ధం అయిందని వార్తలు కూడా వచ్చాయి. ఇక శిల్పాశెట్టి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఒక మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది. ‘జీవితాన్ని వెనక్కి తిప్పి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టే ఛాన్స్ ఉండదు, అయితే ఆ ప్రయాణాన్ని కొత్తగా ముగించవచ్చు’ అని అర్ధం వచ్చేలా శిల్పాశెట్టి ఒక మెసేజ్ పోస్ట్ చేసింది. ఈ మెసేజ్ అర్థం.. భర్త రాజ్ కుంద్రాకి విడాకులు ఇవ్వడమే అని అంటున్నారు నెటిజన్లు.

సంబంధిత సమాచారం :