విజయ్ “ఖుషీ” షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్!

Published on Jan 30, 2023 1:53 pm IST


టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. సమంతా మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుండటంతో, ఆమె షూటింగ్‌లకు విరామం తీసుకుంది. అప్పటి నుండి, ఆమె తెలుగు చిత్రం ఖుషీ గురించి అనేక పుకార్లు ఆన్‌లైన్‌లో వెలువడుతున్నాయి.

ఆ పుకార్లకు చెక్ పెట్టడానికి, చిత్ర దర్శకుడు శివ నిర్వాణ చిత్ర షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ ను ఇచ్చారు. చిత్ర రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభిస్తాం అని అన్నారు. అంతా అందం గానే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. మురళీ శర్మ, జయరామ్, సచిన్ ఖేడాకర్, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీకి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :