పునీత్ మరణం పై శివ రాజ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

Published on Nov 1, 2021 7:29 pm IST


కన్నడ స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ అక్టోబర్ 29 వ తేదీన గుండెపోటు తో మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అక్టోబర్ 31 వ తేదీన ప్రభుత్వ లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు ముగిశాయి. పునీత్ రాజ్ కుమార్ కి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు.

నేడు పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అతని మృతి పట్ల భావోద్వేగం అయ్యారు. నేను పునీత్ రాజ్ కుమార్ సోదరుడిని కావచ్చు కానీ, నేను ఎల్లప్పుడూ అతనిని నా కొడుకు అని చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు.ఇంత చిన్న వయసులో అతన్ని కోల్పోవడం నన్ను చాలా బాధిస్తుంది అని వ్యాఖ్యానించారు. నా ప్రియమైన అప్పు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More