పునీత్‌ రాజ్‌కుమార్‌ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది !

Published on Nov 29, 2021 10:01 am IST

కన్నడ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ చనిపోయి నెల రోజులు అయిపోతుంది. తాజాగా పునీత్ పెద్దన్నయ్య హీరో శివరాజ్‌ కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్న తమ్ముడి మరణాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పునీత్‌ చనిపోయాడు అనే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అప్పూ ఇంకా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. శివన్న అని ప్రేమగా పిలుస్తున్న గొంతు నాకు వినిపిస్తోంది.

పునీత్ మనల్ని విడిచి వెళ్ళిపోయి అప్పుడే నెల రోజులు అయింది. ఈ నెల రోజులు ఎలా గడిచాయో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఎక్కడికి వెళ్లినా పూల దండలతో ఉన్న పునీత్‌ ఫొటోలే నాకు కనిపిస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన ప్రతిసారీ నాకు వాడే గుర్తుకొస్తున్నాడు. ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలుసు. కానీ నాకంటే ముందు నా చిన్న తమ్ముడు వెళ్లిపోవడం నాకు బాధను కలిగిస్తోంది’ అని శివరాజ్ కుమార్ ఎమోషనల్ గా చెప్పారు.

సంబంధిత సమాచారం :