శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

శివశంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి విషమం..!

Published on Nov 24, 2021 11:24 PM IST

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్‌కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకు కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు.

ప్రస్తుతం చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. అయితే శివ శంకర్ మాస్టర్‌కు చికిత్స అందించడం కష్టమవుతోంది. వైద్య ఖర్చుల నిమిత్తం రోజుకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్‌కు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం. ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా కోరుకుందాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు