గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

Sampradayini

శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ చిత్రం మార్చి 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించారు.

నిజానికి ఈ సినిమాను ముందుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కోసం సిద్ధం చేశారు. అయితే, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని చూసి, ఇది పక్కా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అని ప్రశంసించడంతో పాటు థియేట్రికల్ రిలీజ్ చేయాలని సూచించారు. ఆయన సలహాతో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ముందుకొచ్చారు.

తాజాగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని, థియేటర్‌లో చూస్తేనే అసలైన కిక్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ సినిమాతో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత శివాజీ, లయల హిట్ కాంబినేషన్ రిపీట్ కావడం, క్రైమ్ థ్రిల్లర్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ తోడవడంతో ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.

Exit mobile version