శివపార్వతి థియేటర్‌ లో భారీ అగ్నిప్రమాదం

Published on Jan 3, 2022 9:05 am IST


ఈ రోజు తెల్లవారుజామున కూకట్ పల్లి శివపార్వతి థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. థియేటర్ మొత్తం మంటలు వ్యాపించడంతో హాల్‌ లోని సీట్లు, ఫర్నీచర్‌ అగ్నికి ఆహుతి అయ్యాయి. వెంటనే ముగ్గురు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ సిబ్బంది సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక ఈ ప్రమాదం కారణంగా తమకు భారీగా ఆస్తినష్టం జరిగినట్లు థియేటర్ యాజమాన్యం తెలిపింది. సుమారు రెండు కోట్లు ఆస్థి నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం :