ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్, ఓటిటి ఆడియన్స్ ముందుకి శివరాజ్ కుమార్ ‘వేద’

ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్, ఓటిటి ఆడియన్స్ ముందుకి శివరాజ్ కుమార్ ‘వేద’

Published on Feb 6, 2023 1:30 PM IST

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కెరీర్ 125వ మూవీ వేద. హర్ష దర్శకత్వంలో జీ స్టూడియోస్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ గా నిర్మితం అయిన ఈ మూవీ 2022 డిసెంబర్ 23 న కన్నడ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఘనవి లక్ష్మణ్, శ్వేతా చెంగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ యాక్షన్ డ్రామా మూవీని ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు నిర్వహించనుండగా బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నారు. అయితే విషయం ఏమిటంటే, తెలుగులో ఫిబ్రవరి 9న థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కానుండగా సరిగ్గా ఒక్కరోజు తరువాత అనగా ఫిబ్రవరి 10న వేద మూవీ తెలుగు సహా అన్ని ఇతర భాషల్లో జీ 5 ఓటిటి ద్వారా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇది ఒకరకంగా వేద మూవీకి దెబ్బె అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుని కలెక్షన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు