“అవతార్ 2” ప్రీమియర్ ముందు కేమరూన్ కి దెబ్బ.?

“అవతార్ 2” ప్రీమియర్ ముందు కేమరూన్ కి దెబ్బ.?

Published on Dec 13, 2022 10:03 AM IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం “అవతార్ 2” కోసం అందరికీ తెలిసిందే. 2009 లో వచ్చిన వరల్డ్ వైడ్ గ్రాండ్ హిట్ అవతార్ కి సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం ఈసారి “అవతార్ ది వే ఆఫ్ వాటర్” గా రాబోతుంది. మరి ఈ అవైటెడ్ సినిమా జస్ట్ మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది అనగా ఇప్పుడు ఈ చిత్ర సృష్టికర్త జేమ్స్ కేమరూన్ కి షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది.

ఈ చిత్రం రిలీజ్ కి ముందు హాలీవుడ్ లో గ్రాండ్ ప్రీమియర్స్ ని ఈరోజు ప్లాన్ చేయగా సరిగా ఈరోజునే దర్శకుడు జేమ్స్ కేమరూన్ కోవిడ్ పాజిటివ్ అయ్యినట్టుగా న్యూస్ బయటకి వచ్చింది. దీనితో అయితే ఈరోజు ప్రీమియర్స్ కి గాను తాను దూరం అయ్యినట్టుగా రిపోర్ట్స్. మరి లాస్ట్ చేసి ఇలా కావడం అనేది అవతార్ ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింటింగ్ న్యూస్ అనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు