విషాదం : “3 ఇడియట్స్” నటుడు మృతి.!

Published on Sep 21, 2023 6:14 pm IST


బాలీవుడ్ హిస్టరీలో ఉన్నటువంటి పలు భారీ హిట్ చిత్రాల్లో స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో చేసిన చిత్రం “3 ఇడియట్స్” కూడా ఒకటి మరి ఈ చిత్రంలో అయితే ముఖ్య పాత్రలో నటించిన ఓ ప్రముఖ హిందీ నటుడు దురదృష్టవశాత్తు తన ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.

అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే నటుడు అఖిల్ మిశ్ర ప్రస్తుతం తన పర్శనల్ లైఫ్ లోనే బిజీగా ఉండగా తాను తన ఇంటి వంట గదిలో ఏదో వస్తువు కోసం స్టూల్ మీదకి ఎక్కి తీసే క్రమంలో ఆ స్టూల్ మీద నుంచి తాను జారి పడ్డారు అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరట.

తరువాత తన భార్య సుజనే బెర్నెట్ కి ఈ విషయం తెలియడంతో ఆమె ఈ ఘటనను వెల్లడించి తన బాధను వ్యక్తం చేశారు. అయితే గత నెలలోనే అఖిల్ మిశ్రా బీపీ మూలాన హాస్పిటల్ లో జాయిన్ కావాల్సి వచ్చింది అని కానీ ఇప్పుడు జరిగిన ఘటన మూలాన విపరీతమైన రక్త స్రావం మూలాన ఆయన చికిత్స చేసే లోపే కన్ను మూశారని ఆమె చెప్పుకొచ్చింది.

దీనితో ఈ విషాద వార్తతో బాలీవుడ్ మీడియా ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తుంది. మా 123తెలుగు యూనిట్ కూడా ఊహించని పరిణామం పట్ల అఖిల్ మిశ్రా గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం :