“యశోద” పై కేసు..డీటెయిల్స్ ఇవే.!

Published on Nov 25, 2022 8:00 am IST

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటించిన లేటెస్ట్ సాలిడ్ థ్రిల్లర్ హిట్ చిత్రం “యశోద”. దర్శకులు హరి అండ్ హరీష్ లు తెరకెక్కించిన ఈ చిత్రం గత వారం రిలీజ్ కాగా ఇది సూపర్ హిట్ టాక్ సంతరించుకొని గట్టి ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రం రాబట్టింది. ఇక అక్కడ నుంచి ఈ చిత్రం ఓవర్సీస్ సహా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించి సామ్ కెరీర్ లో భారీ హిట్ గా నిలవగా ఈ చిత్రంపై ఇప్పుడు కేసు నమోదు కావడం షాకింగ్ గా మారింది.

మరి ఈ చిత్రంలో చూపించే “ఈవా ఐవిఎఫ్ హాస్పిటల్స్” పేరిట ఓ సరోగసి కేంద్రం చూపించి అందులో జరిగే అక్రమాలు అంటూ కొన్ని షాకింగ్ విజువల్స్ అయితే ఉంటాయి. అయితే నిజ జీవితంలో ఇదే “ఈవా” పేరిట ఉన్న తమ హాస్పిటల్ అభ్యంతరకరంగా ఉందని ఈ చిత్రం వల్ల బయట తమ గౌరవం పోతుంది అని ఈ సినిమా విషయంలో వారు అయితే హైదరాబాద్ కోర్టుని ఆశ్రయించారని తెలుస్తుంది.

దీనితో అయితే ఈ చిత్రం విషయంలో ఈ వార్త షాకింగ్ గా మారింది. దీనితో కోర్టు కూడా యశోద ఓటిటి రిలీజ్ ని కూడా వాయిదా వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా శ్రీదేవి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :