షాకింగ్ : మరోసారి హీరో విశాల్ కి షూటింగ్ లో ప్రమాదం.!

Published on Aug 11, 2022 7:58 am IST


కోలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ యంగ్ అండ్ మాస్ హీరో విశాల్ కూడా ఒకడు. మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉండగా రీసెంట్ గానే తన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “లాఠీ” షూటింగ్ లో అనేక సార్లు గాయాల పాలయ్యాడు. ఇప్పుడు కూడా తన తర్వాతి చిత్రం మార్క్ ఆంటోనీ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ లో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాలో కూడా ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఇందులో విశాల్ తీవ్ర గాయాల పాలయినట్టుగా తమిళ సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. మొత్తానికి అయితే తన సినిమాల విషయంలో విశాల్ మాత్రం చాలా రిస్కులు తీసుకుంటున్నాడని చెప్పాలి, మరి తాను అయితే ఆరోగ్యంతో కోలుకోవాలని అభిమానులు ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తుండగా రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :