షాకింగ్ : “కేజీయఫ్” సినిమాలో కీలక నటుడు కన్నుమూత.!

Published on May 7, 2022 12:00 pm IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా “కేజీయఫ్ చాప్టర్ 2″ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. భారీ స్థాయి వసూళ్ళని సాధించి దూసుకెళ్తున్న ఈ సినిమా మేకర్స్ కి ఇప్పుడు ఒక చేదు వార్త అయితే ఎదురయ్యింది.

ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటులు కూడా సాలిడ్ పెర్ఫవుమెన్స్ ని కనబరిచారు. అయితే ఫస్ట్ పార్ట్ మరియు సెకండ్ పార్ట్ లో కూడా ఒక కీలక రోల్ ని నటుడు మోహన్ జునేజా పోషించారు.. యష్ రోల్ ని తాను ఎలివేట్ చేస్తూ గ్యాంగ్ తో వచ్చే వాలారు గ్యాంగ్ స్టర్ కానీ అతనొక్కడే వస్తాడు మాన్స్టర్” అంటూ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ కూడా గూజ్ బంప్స్ తెస్తుంది.

రెండో భాగంలో కూడా కాస్త నిడివిలోనే తాను కనిపించినా తాను కలిగించిన ప్రభావం మాత్రం చాలా ఎక్కువ అయితే ఆయన ఊహించని రీతిలో కన్ను మూశారని తెలిసింది. దీనితో కేజీయఫ్ చిత్ర నిర్మాణ సంస్థ తమ కేజీయఫ్ కుటుంబం తరపున ఆయన అకాల మరణం పట్ల చింతిస్తూ నివాళులు అర్పించారు.

సంబంధిత సమాచారం :