విషాదం : లెజెండరీ నటులు కైకాల కన్నుమూత.!

విషాదం : లెజెండరీ నటులు కైకాల కన్నుమూత.!

Published on Dec 23, 2022 7:59 AM IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర ఉన్నటువంటి దిగ్గజ నటుల్లో ఒకరైన హీరో సూపర్ స్టార్ కృష్ణ అలాగే రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి లాంటి నటుల అకాల మరణం ఈ ఏడాదిలో తీరని లోటుగా మారగా ఈ ఏడాదిలోనే మరో తెలుగు సినిమా దిగ్గజం ప్రముఖ నటులు కైకాల సత్యన్నారాయణ గారు కన్ను మూశారన్న వార్త మరో తీరని విషాదంగా మారింది.

తెలుగులో ఎలాంటి పాత్రని అయినా సరే అలవోకగా చేసే ఈ నట విరాట్ గత కొంత కాలం నుంచి అయితే వయసు సంబంధిత అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారు. మరి ఆ మధ్య అయితే చికిత్స పొంది రికవర్ కూడా కాగా మెగాస్టార్ చిరంజీవి అలాగే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ లు కూడా ఆయన్ను కలిసి యోగ క్షేమాలు కనుక్కొని తాము అండగా నిలిచారు.

మరి 1935 లో జన్మించిన తాను నటునిగా, దర్శకునిగా, రాజకీయ నాయకునిగా ఎన్నో సేవలు అందించి 700 పై చిలుకు చిత్రాల్లో నటించారు. ఇక తెలుగులో యముని పాత్ర అంటే తానే గుర్తుకు వస్తారు అనే ఐకాన్ నిలిచిన ఆయన తన 87వ ఏట స్వర్గస్తులు అయ్యారని తెలియడం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు ఇండియన్ సినిమా దగ్గర కూడా ఓ తీరని విషాదం. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు