షాకింగ్..లెజెండరీ దర్శకుడు మణిరత్నంకి కరోనా.!

Published on Jul 19, 2022 11:07 am IST


ఇటీవల మళ్ళీ దేశ వ్యాప్తంగా కూడా ప్రమాదకర వైరస్ కోవిడ్ 19 మళ్ళీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి సంఖ్య పెరుగుతుండగా మళ్ళీ సినీ ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతుండడం కాస్త ఆందోళనకరంగా మారింది. మరి ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఇండియాస్ లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కరోనా బారిన పడినట్టుగా తమిళ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

గత రెండు రోజులు నుంచి మణిరత్నం కాస్త అసౌకర్యంగా ఉన్న నేపథ్యంలో ఈరోజు తాను హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. మరి మణిరత్నం నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “పొన్నియిన్ సెల్వన్” కూడా రిలీజ్ కి రెడీగా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మరి ఈ గ్యాప్ లో తనకి ఇలా జరగడం బాధాకరం. మరి వారు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మా 123తెలుగు యూనిట్ కోరుకుంటుంది.

సంబంధిత సమాచారం :