షాకింగ్..ఓటిటి స్టార్ మనోజ్ బాజ్ పై కి మాతృ వియోగం.!

Published on Dec 8, 2022 2:04 pm IST

మన ఇండియన్ ఓటిటి దగ్గర భారీ హిట్ అయినటువంటి పలు ఓటిటి షో లు మరియు వెబ్ సిరీస్ లలో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అయినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మరి అందులో నటించిన నటుడు మనోజ్ బాజ్ పై కోసం చెప్పక్కర్లేదు. అక్కడ నుంచి తన నటన కెరీర్ మరో లెవెల్ కి వెళ్ళింది.

అయితే మనోజ్ కి గత కొన్నాళ్ల కితమే తన తండ్రి మరణంతో పితృ వియోగం జరగగా ఇప్పుడు అయితే మరో విషాదం తన ఇంట నెలకొంది. ఇప్పుడు వారి మాతృమూర్తి గీతా దేవి కన్ను మూసినట్టుగా నిర్ధారణ అయ్యాయి. అయితే ఆవిడ గత 20 రోజులు నుంచి వయసు సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ఉండగా ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో పుష్పాంజలి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ అయితే ఆవిడ తన 80వ ఏట కన్ను మూశారట. దీనితో ఈ వార్త తెలిసిన ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :