షాకింగ్ : ఎన్నో అద్భుత పాటలు పాడిన సింగర్ కన్నుమూత.!

Published on Jun 1, 2022 7:04 am IST


తాజాగా మన ఇండియన్ సినిమా దగ్గర ఒక తీరని లోటు చోటు చేసుకుంది. బాలీవుడ్ సహా తెలుగు మరియు దక్షిణాది లో ఎన్నో సినిమాలకి పాటలు పాడినటువంటి ప్రముఖ టాలెంటెడ్ గాయకుడు కే. కే (కృష్ణ కుమార్ కునాథ్) ఆకస్మిక మరణ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఇక వివరాల్లోకి వెలితే నిన్న మంగళవారం రాత్రి కలకత్తా లోని ఓ ప్రాంతంలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు వెళ్లగా కే కే ఆ తర్వాత తాను దిగిన హోటల్ రూమ్ లో సడెన్ గా కుప్పకూలిపోయారు. దీనితో హాస్పిటల్ కి తరలించగా తన 53 వ ఏట కే.కే తన తుది శ్వాస విడిచి స్వర్గస్తులు అయ్యారు.

దీనితో ఈ షాకింగ్ వార్త విని అంతా విస్మయానికి లోనవుతున్నారు. అయితే బాలీవుడ్ లో ఎన్నో పాటలు పాడిన తాను తెలుగులో పవన్ కి ఖుషీ, బాలు, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో ఎన్నో చార్ట్ బస్టర్స్ ఆలపించారు. అలాగే మనసంతా నువ్వే, ఆర్య సిరీస్ తదితర ఎన్నో హిట్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ని తాను ఆలపించారు. అయితే ఇంత పిన్న వయసూల్ప్ తాను ఇలా కన్ను మూయడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఈ వార్త తో సంగీత ప్రియులు మరియు అనేకమంది సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :