ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కి ప్రమాదం.!

Published on Jan 7, 2023 4:20 pm IST

ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. గత ఏడాదిలో ఎన్నో చిత్రాలు రిలీజ్ కి వచ్చాయి. మరి వాటిలో కొన్ని బాగానే రాణించినా మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదు. అయితే జస్ట్ కిందటి నెల క్రిస్మస్ కానుకగా వచ్చిన చిత్రం “సర్కస్” మంచి సక్సెస్ అందుకుంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా కూడా చతికిల పడింది. మరి ఈ సినిమా యూనిట్ కి అలాగే బాలీవుడ్ లో ఇప్పుడు షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది.

ఈ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి హైదరాబాద్ తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ లో గాయాలపాలైనట్టుగా లేటెస్ట్ సమాచారం. అయితే రోహిత్ ఓ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తుండగా అనుకోని రీతిలో తాను ప్రమాదానికి గురయ్యారు. దీనితో వెంటనే తనని ఎల్బీ నగర్ లోని కామినేని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనితో ఈ వార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :