షాకింగ్ : ప్రముఖ గాయని వాణి జైరాం కన్నుమూత.!

షాకింగ్ : ప్రముఖ గాయని వాణి జైరాం కన్నుమూత.!

Published on Feb 4, 2023 3:26 PM IST

గడిచిన ఈ కొన్ని రోజుల్లోనే ఊహించని విధంగా పలు విషాద వార్తలు మన టాలీవుడ్ లో చోటు చేసుకుంటూ వస్తుండడం షాకింగ్ గా మారింది. కేవలం రోజుల వ్యవధి లోనే మన ఇండియన్ సినిమా దగ్గర దిగ్గజాలుగా వెలుగొందిన నటులు, దర్శకులను కోల్పోవడం చాలా బాధాకరం. మరి ఇదిలా ఉండగా కళా తపస్వి కే విశ్వనాథ్ గారి మరణ వార్త ఇంకా అందరిలో అలానే ఉంది ఇప్పుడు ఈ మధ్యలో మరో వెటరన్ గాయని శ్రీ వాణి జైరాం గారు కన్ను మూసారు అన్న వార్త షాకింగ్ గా మారింది.

ఈరోజు చెన్నై లోని వారి స్వగృహం లోనే ఆమె తన 77వ ఏట తుది శ్వాస విడిచినట్టుగా నిర్ధారణ అయ్యింది. మరి వీరు తమిళ నాడు వెల్లూరు లో జన్మించగా 19 భాషల్లో పది వేలకి పైగా పాటలను ఆలపించారు. తమిళ్ తెలుగు, మలయాళ కన్నడ సహా ఎన్నో భాషల్లో తన గాత్రాన్ని ఇచ్చిన ఆమెకి ఈ జనవరి లోనే పద్మ పురస్కారం కూడా వరించింది.

కానీ ఈ మధ్యలోనే ఇలా జరగడం హృదయ విదారకం అని చెప్పాలి. దీనితో వారి మరణ వార్తతో భారతదేశ సినిమా దిగ్బ్రాంతి వ్యక్తం చేయగా వారితో వర్క్ చేసిన సంగీత దర్శకులు మరింత బాధ వ్యక్తం చేస్తున్నారు. మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు