షాకింగ్ : మహేష్ బాబు ఇంట్లో చోరీ యత్నం..డీటెయిల్స్ ఇవే!

Published on Sep 29, 2022 1:00 pm IST

నిన్ననే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మహేష్ మాతృమూర్తి శ్రీమతి ఇందిరా దేవి గారు మరణంతో ఘట్టమనేని వారి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోగా ఇప్పుడు వారి ఇంటికి సంబంధించి మరో షాకింగ్ వార్త అయితే ఇప్పుడు బయటకి వచ్చింది.

వారి ఇంట నిన్న అలా విషాదం నెలకొన్న చోట ఓ చోరీ యత్నం జరిగింది. నిన్న మంగళవారం రాష్ట్రి ఓ దొంగ మహేష్ బాబు ఇంట్లో దొంగతనం చెయ్యాలని ప్రయత్నం చేసే క్రమంలో ఎత్తైన గోడ నుంచి దూకే ప్రయత్నం చేసాడట. కానీ అతడు ఆ గోడ బాగా ఎత్తు నుంచి దూకడంతో అతడికి బాగా గాయాలు అయ్యి పట్టుబడ్డాడు.

దీనితో ఇంట్లో పెద్ద చప్పుడు కావడంతో లేచిన కుటుంబీకులు అతడి కోసం ముందు పోలీసులకి సమాచారం అందించగా తర్వాత వారు అతన్ని హాస్పిటల్ లో చికిత్సకి జాయిన్ చేశారట. మరి ఈ ఘటన సమయంలో మహేష్ బాబు కూడా ఇంట్లోనే ఉన్నారని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :