సీనియర్ హీరో చిత్రానికి భారీ బడ్జెట్

27th, May 2017 - 09:27:25 AM


సీనియర్ హీరో రాజశేఖర్ కొంత గ్యాప్ తరువాత యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో రాబోతున్న విషయం తెలిసిందే. పివిఎస్ గరుడ వేగ 125.18 అనే టైటిల్ తోనే ఈ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గుంటూరు టాకీస్ చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈచిత్రానికి సంబందించిన ఓ విషయాన్ని నిర్మాత కోటేశ్వరరాజు వెల్లడించారు. ఈ చిత్రం 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని వెల్లడించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.రాజశేఖర్ గత చిత్రాలను పరిశీలిస్తే ఈ చిత్రానికి ఇంత బడ్జెట్ కేటాయించడం సాహసోపేతమైన నిర్ణయంగానే చెప్పొచ్చు.

ఈ చిత్రం యొక్క క్వాలిటీ తగ్గకుండా భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నామని నిర్మాత తెలిపారు. బ్యాంకాక్, జార్జియా, హైదరాబాద్ మరియు ముంబై లో పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు నిర్మాత తెలిపారు. ఇటీవల ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ల ఆద్వర్యంలో చిత్రీకరించారు. పూజాకుమార్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.