షాకింగ్ బజ్: ‘జైలర్ 2’లో పవన్ కళ్యాణ్? నవ్వుకుంటున్న ఫ్యాన్స్

Jailer

ప్రస్తుతం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు క్రేజీ మాస్ సీక్వెల్స్ చిత్రాల్లో జైలర్ 2 కూడా ఒకటి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వచ్చిన మొదటి సినిమా అందులోని కామియోలకి థియేటర్స్ దద్దరిల్లాయి. ఇలానే పార్ట్ 2 కోసం కూడా సెన్సేషనల్ కామియో లని దర్శకుడు మరోసారి ప్లాన్ చేసినట్టు టాక్ వచ్చింది.

అయితే బరిలో కొన్ని పేర్లు చివరికి వచ్చేసరికి లేవని కూడా తెలిసింది. కానీ ఇప్పుడు ఇప్పుడు అస్సలు ఊహించని బజ్ కోలీవుడ్ వర్గాలు వైరల్ చేస్తున్నాయి. అసలు ఒక్క పర్సెంట్ కూడా నమ్మడానికి వీలు లేని టాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జైలర్ 2 లో కనిపిస్తారని రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఈ కామియో మొదట షారుఖ్ తో అనుకున్నది అని షారుఖ్ అందుబాటులో లేక ఆ పవర్ఫుల్ రోల్ ని పవన్ చేస్తున్నట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది పక్కన పెడితే ఇది విన్న పవన్ అభిమానులు మాత్రం ఫళ్ళున నవ్వేస్తున్నారు. అసలు పవన్ కి తన సినిమాలు చేసే ఖాళీనే ఉండదు అంటే ఇక వేరే సినిమాలో కామియోనా అంటూ పెదవి విరుస్తున్నారు. మరి వీటి అన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Exit mobile version