షాకింగ్ : ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత.!

షాకింగ్ : ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత.!

Published on Jan 27, 2023 11:41 AM IST

ఈరోజు ఉదయమే టాలీవుడ్ లో దిగ్గజ వెటరన్ నటి అకాల మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. మరి ఈ విషాద వార్త తోనే మరో షాకింగ్ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ కి తగిలింది. తెలుగు సినిమాలో అనేక చిత్రాలకి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి ఊహించని విధంగా ఈరోజు ఉదయం ఆకస్మిక గుండె పోటుతో మరణించినట్టుగా తెలిసింది.

ఈరోజు చెన్నై లో ఈ విషాద ఘటన జరిగిందట. తాను తమిళ్ నుంచి తెలుగులో వచ్చిన ఎందరి స్టార్ నటులు విక్రమ్, సూర్య, అజిత్, మోహన్ లాల్ జైరాం ఇలా ఎందరో స్టార్స్ కి డబ్బింగ్ చెప్పారు. అపరిచితుడు, యముడు లాంటి ఎన్నో ఐకానిక్ పాత్రలకి గాను ఎన్నెన్నో వేరియేషన్స్ లో తాను డబ్బింగ్ చెప్పారు.

అలాంటి వెర్సటైల్ ఆర్టిస్ట్ ఇప్పుడు లేరు అనే మాట మింగుడు పడనిది. ఖచ్చితంగా ఈయన లేని లోటు టాలీవుడ్ డబ్బింగ్ ఇండస్ట్రీ లో చాలా పెద్దది. మరి వీరి ఆకస్మిక మరణం పట్ల చింతిస్తూ మా 123తెలుగు యూనిట్ విచారం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు