షాకింగ్..మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకి పుత్ర వియోగం.!

Published on Mar 1, 2022 12:00 pm IST

ప్రపంచంలో దిగ్గజ టెక్ సంస్థల్లో ఒకటైన మైక్రో సాఫ్ట్ కోసం ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన పని లేదు. మరి ఇలాంటి దిగ్గజ కంపెనీకి మన దేశీయుడు అందులోని తెలుగు రాష్ట్రాలకి చెందిన వారు అయినటువంటి సత్య నాదెళ్ల సీఈఓ గా ఉన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సత్య నాదెళ్ల కుటుంబంలో తీరని విషాదం నెలకొన్నట్టుగా ఇప్పుడు ఖరారు అయ్యింది.

సత్య నాదెళ్ల తనయుడు అయినటువంటి జైన్ నాదెళ్ల ఇటీవల కన్ను మూసినట్టుగా తెలిసింది. అయితే మరిన్ని వివరాల్లోకి వెళ్లినట్టు అయితే జైన్ నాదెళ్ల తన బాల్యం నుంచే మస్తిస్కానికి చెందిన ఓ అరుదైన వ్యాధి(సెరిబ్రల్ పల్సి) తో బాధ పడుతున్నారట.

మరి ఇపుడు దాని మూలానే తన 26వ ఏట జైన్ నాదెళ్ల కన్ను మూసినట్టుగా ఇప్పుడు వెల్లడి అయ్యింది. దీనితో ఈ వార్త తెలిసిన అనేకమంది ప్రపంచ ప్రముఖులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. మరి జైన్ నాదెళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ ప్రగాఢంగా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :