విషాదం..తెలుగు యూట్యూబ్, ఓటిటి ఫేమ్ యంగ్ నటి మృతి.!

విషాదం..తెలుగు యూట్యూబ్, ఓటిటి ఫేమ్ యంగ్ నటి మృతి.!

Published on Mar 19, 2022 10:58 AM IST

మన తెలుగు సినిమా పై మక్కువతో చాలామంది యంగ్ టాలెంట్ ఎప్పటికప్పుడు తమ ట్రైల్స్ వేస్తూ ఉంటారు. అలా వాటికి మార్గంగా యూట్యూబ్ మరియు ఓటిటి లలో తమ టాలెంట్ చాటి సినిమాల వరకు వచ్చిన యంగ్ నటులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇపుడు ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

యూట్యూబ్ లో పలు సిరీస్ లు మరియు ఓటిటి లో వెబ్ షోలు చేసినటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ నటి గాయత్రి(డాలి) మరణించింది అని వార్త సినీ వర్గాల్లో ఆమె సన్నిహిత ప్రముఖ నటుల్ని మరియు ఆమె కుటుంబీకులని విషాదంలోకి నెట్టేసింది. అయితే వివరాల్లోకి వెళితే ఆమె తన ఫ్రెండ్ తో కారులో ప్రయాణం చేస్తుండగా రోడ్డు ప్రమాదం సంభవించి మరణించినట్టుగా తెలిసింది.

దీనితో నటి సురేఖ వాణి తన సోషల్ మీడియాలో విషాదం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి యువ నటులు తమ కెరీర్ లో ముందుకెళ్ళకుండానే ఇలా జరగడం బాధాకరం. ఆమె అకాల మరణం పట్ల మా 123తెలుగు టీం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు