హృతిక్ సినిమాకి షాకింగ్ ఓపెనింగ్స్..!

Published on Oct 2, 2022 1:00 am IST


గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సినిమా ఏమంత బాగాలేదు. చాలా వరకు ఈ ఏడాది బాలీవుడ్ లో రిలీజ్ అయ్యిన చిత్రాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. కానీ లేటెస్ట్ గా వచ్చిన భారీ పాన్ ఇండియా చిత్రం “బ్రహ్మాస్త్ర” మాత్రం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది. దీనితో ఈ సినిమా తర్వాత రిలీజ్ కి రెడీ అయ్యిన మరో బిగ్గెస్ట్ చిత్రం “విక్రమ్ వేద”.

స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రం ఒక సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేయగా దీనికి కూడా రిలీజ్ ప్లాన్స్ సినిమా ట్రైలర్, టీజర్ రెస్పాన్స్ లతో భారీ ఓపెనింగ్స్ ఉంటాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈ చిత్రానికి అయితే మొదటి రోజు షాకింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజు ఇండియాలో కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయట.

ఇది హృతిక్ కెరీర్ లోనే ఒక తక్కువ మొత్తం అని చెప్పాలి. లాస్ట్ టైం తాను చేసిన మల్టీ స్టారర్ “వార్” చిత్రానికే 50 కోట్లకి పైగా వసూళ్లు ఓవరాల్ వచ్చాయి. కానీ విక్రమ్ వేద కి ఇంత తక్కువ రావడం ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యంగా మారింది. అయితే ఈ చిత్రం రెండో రోజు నుంచి బెటర్ గా వసూళ్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి అనుకున్న రేంజ్ హిట్ లా ఇది నిలుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :