హిందీ మార్కెట్ లో అదరగొడుతున్న “కార్తికేయ 2” సినిమా.!

Published on Aug 14, 2022 10:01 am IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చిన మరో కంటెంట్ ఓరియెంటెడ్ బాక్సాఫీస్ హిట్ సినిమా “కార్తికేయ 2”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తాము అందుకున్న భారీ సక్సెస్ దిశగా కొనసాగుతుండగా ఈ సినిమా హిందీ రిలీజ్ కూడా నెమ్మదిగా జరిగింది. కానీ అనూహ్యంగా హిందీ మార్కెట్ కార్తికేయ 2 కి షాకింగ్ డిమాండ్ నెలకొంది.

అక్కడి హిందీ సినిమాల కంటే ఈ సినిమాకే షోస్ ఫుల్ అవుతుండడం పైగా అక్యుపెన్సీ కూడా వాటికన్నా దీనికి అధికంగా ఉండడం ట్రేడ్ వర్గాలకి షాకింగ్ తెలుగు సినిమాకి మళ్ళీ గర్వకారణంగా మారింది. దీనితో హిందీ వెర్షన్ లో థియేటర్స్ కౌంట్ ని పెంచే విధంగా ప్లాన్ చేస్తామని హీరో నిఖిల్ ఈ రెస్పాన్స్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి అయితే హిందీలో కార్తికేయ 2 డెఫినెట్ గా వండర్స్ నమోదు చేస్తుందేమో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :