విషాదం : సూపర్ స్టార్ మహేష్ బాబు కి మాతృ వియోగం.!

Published on Sep 28, 2022 7:39 am IST

ఇటీవలే మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టార్ హీరో ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన సంగతి మరువక ముందే టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకోవడం ఇపుడు మరింత బాధాకరంగా నిలిచింది. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది.

మహేష్ బాబు మాతృమూర్తి అలాగే సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య అయినటువంటి ఇందిరా దేవి గారు ఈరోజు తెల్లవారు జాము 4 గంటల సమయంలో కన్ను మూశారన్న వార్త ఇప్పుడు అధికారికంగా బయటకి వచ్చింది. దీనితో ఇప్పుడు ఘట్టమనేని వారి ఇంట తీరని విషాదం నెలకొంది.

ఈ విషాద ఘటనతో సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ మహేష్ బాబు కి ధైర్యం చెబుతున్నారు. మరి ఇందిరా దేవి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మా 123తెలుగు యూనిట్ కూడా ఆకాంక్షిస్తుంది.

సంబంధిత సమాచారం :