‘బిగ్ బాస్ 6’ పై ఇండియా వైడ్ షాకింగ్ ట్రెండ్.!

Published on Dec 4, 2022 10:01 am IST

ఎప్పుడైనా కూడా ఓ కొత్తదనాన్ని అయితే మన టాలీవుడ్ లో కానీ తెలుగు ఆడియెన్స్ ఆదరించినట్టుగా మరెక్కడా ఆదరించరని చెప్పాలి. అలాగే తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర అయితే ఒక రివొల్యూషన్ లా వచ్చిన బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఏకంగా ఇండియన్ స్మాల్ స్క్రీన్ దగ్గరే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఇచ్చిన షో గా మన తెలుగు ఆడియెన్స్ నిలిపారు.

అయితే మొదటి మూడు నాలుగు సీజన్ల వరకు పర్వాలేదు కానీ తర్వాత తర్వాతికి షో పై ఆసక్తి అందరిలో సన్నగిలింది. దీని అనేక కారణాలే జెన్యూన్ షో ఫాలోవర్స్ అయితే చెప్తారు. ఇక ఇప్పుడు ఆరవ సీజన్లోకి అడుగు పెట్టగా దీనికి కూడా ఏమంత గొప్ప రేటింగ్స్ రావట్లేదు అని టాక్ ఉంది.

ఇక ఇప్పుడు అయితే సోషల్ మీడియాలో షాకింగ్ గా ఓ నెగిటివ్ ట్రెండ్ గత ఆరేడు గంటలకి పైగా ఇండియా వైడ్ నడుస్తుంది. ఏకంగా 26 వేలకి పైగా ప్లాప్ షో బిగ్ బాస్ 6 అంటూ ఓ ట్యాగ్ తో ట్రెండ్ నడుస్తుంది. మరి దీనికి కారణం సరైన ఎంటర్టైన్మెంట్ వారికి దక్కకపోవడమే అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈసారి ఆడియెన్స్ మాత్రం బాగా నిరాశలోనే ఉన్నారు.

సంబంధిత సమాచారం :