షాకింగ్ టీఆర్పీ అందుకున్న ఎన్టీఆర్, మహేష్ ల గ్రాండ్ ఎపిసోడ్.!

Published on Dec 16, 2021 3:02 pm IST

మన తెలుగు బుల్లితెరపై ఒకటైన గ్రాండ్ రియాలిటీ షో లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా కాలం తర్వాత బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చిన షో “ఎవరు మీలో కోటీశ్వరులు” కూడా ఒకటి. అయితే గత సీజన్లతో పోలిస్తే చాలా ఎక్కువ రేటింగ్స్ తో రికార్డులు నమోదు చేసిన ఈ సీజన్లో ముందు లానే కొంతమంది ప్రముఖ సినీ తారలు కూడా ఈసారి వచ్చారు.

అయితే వాటి అన్నిటిలో కూడా మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఎపిసోడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్లాన్ చేసింది అని చెప్పాలి. అయితే ఈ ఎపిసోడ్ స్యూర్ షాట్ గా రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ వచ్చే ఎపిసోడ్ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నారు కానీ ఊహించని విధంగా షాకింగ్ టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ గ్రాండ్ ఎపిసోడ్ కి కేవలం 4.9 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చిందట. ఇది షాకింగ్ అనే చెప్పాలి. ముందు అంతా వీరిద్దరి ప్రోమోస్ కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చినవి ఉన్నాయి. కానీ ఫైనల్ గా రేటింగ్ కి వచ్చేసరికి ఇలా అయ్యింది.

సంబంధిత సమాచారం :