‘పొన్నియన్ సెల్వన్ 1’ కి షాకింగ్ టీఆర్పీ రేటింగ్

Published on Mar 2, 2023 5:04 pm IST

దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పొన్నియన్ సెల్వన్ 1. ఇటీవల భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుని రూ. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల వారు నిర్మించారు.

ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకడు మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీకి సీక్వెల్ గా ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 మరింత గ్రాండ్ గా భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, ఇటీవల పొన్నియన్ సెల్వన్ 1 మూవీని జెమినీ టివిలో టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయగా దానికి కేవలం 2.73 మాత్రం టిఆర్పి రేటింగ్ దక్కడం నిజంగా షాకింగ్ విషయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపొందిన ఈ మూవీకి రవి వర్మన్ ఫోటోగ్రఫి అందించారు.

సంబంధిత సమాచారం :