బుల్లితెర పై సూపర్ హిట్ మూవీ కి షాకింగ్ రెస్పాన్స్!

Published on May 25, 2023 1:30 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా, డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ యాక్షన్ డ్రామా మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ధియేటర్లు లో సూపర్ హిట్ సాధించింది. ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకున్న ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

మొదటి సారి ప్రసారం అయిన ఈ సినిమా కి షాకింగ్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రానికి జెమిని టీవీ లో 1.87 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ, అనీష్ కురువిల్ల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ను మహేష్ బాబు, నమ్రత, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర లు నిర్మించారు.

సంబంధిత సమాచారం :