షాకింగ్ : విల్ స్మిత్ ని ఏకంగా అన్నేళ్లు బ్యాన్ చేసిన ‘ఆస్కార్’ మేనేజ్మెంట్.!

Published on Apr 9, 2022 8:16 am IST


ప్రపంచంలోనే సినిమాల పరంగా ఉన్న అత్యున్నత పురస్కారం ఏదన్నా ఉంది అంటే అది ఆస్కార్ అవార్డు అనే అందరికీ తెలుసు. మరి ప్రతి ఏడాది కూడా హాలీవుడ్ లో ప్రపంచ సినిమాలకు సంబంధించి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది జరిపిన ఈవెంట్ లో ఓ షాకింగ్ సంఘటన ఇది వరకు ఎన్నడూ లేని విధంగా జరిగింది.

హాలీవుడ్ ప్రముఖ హీరో అయినటువంటి విల్ స్మిత్ ఆ స్టేజ్ పై తన భార్య ఆరోగ్యంపై వ్యాఖ్యాత క్రిస్ రాక్ పలు వ్యంగ్య వాఖ్యలు మాట్లాడాడని స్టేజి పైనే చెంప చెళ్లుమనిపించాడు. అయితే ఈ ఈ ఘటన అనంతరం తాను బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాడు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఆస్కార్స్ వారు విల్ స్మిత్ కి ఊహించని షాకిచ్చారు.

ఇక నుంచి విల్ స్మిత్ ఆస్కార్ కి సంబంధించి ఎలాంటి ఈవెంట్ కి కూడా హాజరు కావడానికి వీలు లేదని ఒక మీటింగ్ ద్వారా ఆస్కార్ బోర్డు వారు మీటింగు పెట్టుకొని కీలక నిర్ణయం ద్వారా నిన్న ఏప్రిల్ 8 2022 నుంచి మరో పదేళ్ల వరకు విల్ స్మిత్ ఆస్కార్ ఈవెంట్ కి రావడం గాని ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చూడడానికి అందులోని వర్చ్యువల్ గా కూడా చూడడానికి వీలు లేదని తెలిపారు. ఇది ఈ ఈవెంట్ కి వచ్చే సేఫ్టీ పర్మిట్స్ కోసం తీసుకోవడం జరిగింది అని వారు కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి ఇలా విల్ స్మిత్ పై పదేళ్లు వేటు పడింది.

సంబంధిత సమాచారం :