“మా”కి పోటీగా ప్రకాష్ రాజ్ అదిరిపోయే ప్లాన్ వేసారా?

Published on Oct 13, 2021 12:21 am IST


తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాల నడుమ జరిగినటువంటి “మా” (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల ఫలితాలు ఎన్ని అనుమానాలకు దారి తీశాయో తెలిసిందే. పైగా ఓట్లు లెక్కింపులు పరంగా చాలా అవకతవకలు జరగడం మరింత షాక్ కి గురి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రకాష్ గెలుస్తారు అనుకున్న వారందరికీ మంచు విష్ణు షాక్ ఇచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

దీనితో ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. అంతేకాకుండా ఆల్రెడీ వారి ప్యానల్ నుంచి గెలిచినా వారిని మళ్ళీ ఓడిపోయారు అనే ప్రకటన ఇవ్వడంతో ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరగలేదని మళ్ళీ ఖరారు చేసుకున్నారు అందరూ.. అయితే ఇదిలా ఉంటే తన ప్యానల్ సభ్యులతో ప్రకాష్ రాజ్ ఒక కీలక మీటింగ్ ని పెట్టినట్టుగా టాక్ వినిపిస్తుంది.

ఇప్పుడు ఉన్న “మా”(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కి పోటీగా ‘ఆత్మా'(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) పెట్టే ఆలోచన చేస్తున్నారట.. మరి ఇది కనుక వాస్తవం అయితే ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక ఇంకా దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :