‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ పై క్రేజీ రూమర్ ?

Published on Sep 19, 2023 9:00 am IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రంలో సమంత ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ప-2 లోని ఐటమ్ సాంగ్ అప్ డేట్ కోసం బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్ చేత ఈ ఐటమ్ సాంగ్ చేయించాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడని.. సమంత సాంగ్ కంటే కూడా.. జాన్వీ కపూర్ పై సాంగ్ అదిరిపోతుంది అని టాక్ నడుస్తోంది. మరి ఐటమ్ సాంగ్ కి జాన్వీ కపూర్ ఒప్పుకుంటుందా? చూడాలి.

ప్రస్తుతం జాన్వీ కపూర్, ఎన్టీఆర్ దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మొత్తానికి పుష్ప 2 సినిమాని సుకుమార్ వెరీ ఇంట్రెస్ట్ గా ప్లాన్ చేశాడు. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే పుష్ప 2 కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక వచ్చే షెడ్యూల్ లో గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :