హీరో రామ్‌ మెడకు గాయం !

హీరో రామ్‌ మెడకు గాయం !

Published on Oct 4, 2021 2:00 PM IST

ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్‌ పోతినేని జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తూ గాయాలపాలయ్యారు. రామ్ మెడకు బాగా గాయమైంది. కాగా తనకు గాయమైన విషయాన్ని స్వయంగా రామ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలియజేశాడు. అయితే, ‘రామ్‌ త్వరగా కోలుకోవాలి..గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియాసినిమా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా కోసం సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి. రామ్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో గతంలో ‘జగడం, రెడీ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే, నేను శైలజ, శివమ్’ లాంటి సినిమాలు వచ్చాయి. మ్యూజిక్ పరంగా ఈ చిత్రాలన్నీ సూపర్ హిట్సే. మళ్ళీ ఇప్పుడు వీరి కలయికలో వస్తోన్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే బజ్ ఉంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు