సైనా నేహ్వాల్ బయోపిక్ షూటింగ్ ప్రారంభమైంది !

ప్రముఖ బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈచిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ సైనా పాత్రలో నటిస్తుంది. ఈచిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంభై లో జరుగుతుంది. అమోల్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టి- సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈచిత్రానికి టైటిల్ ఖరారు చేయలేదు. ఇక శ్రద్ద ఈ చిత్రం తోపాటు ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ లో కథానాయికగా నటిస్తుంది.

ఇక సైనా నేహ్వాల్ ఒకప్పటి కోచ్ పుల్లెల గోపిచంద్ ఫై కూడా ఓ బయోపిక్ తెరకెక్కనుంది. ఈచిత్రంలో గోపీచంద్ పాత్రలో సుధీర్ బాబు నటించనున్నాడు. త్వరలోనే ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version