విలన్ తో ఫైట్ చేసి హీరోయిన్ తో ఆడిపాడిన బన్నీ !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. దేశభక్తి నైపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రచయిత వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లోనే రెండు షెడ్యూళ్లను, ఊటీలో మరొక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

ఈ షెడ్యూల్లో విలన్ అనూప్ ఠాకూర్ సింగ్ తో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని, అను ఇమ్మాన్యూల్ తో ఒక రొమాంటిక్ పాటను పూర్తిచేశాడు బన్నీ. రేపటితో ఈ షెడ్యూల్ ముగియనుంది. దీని తరవాత కొద్దిగా బ్రేక్ తీసుకుని ఇంకో కొత్త షెడ్యూల్ ను మొదలుపెడతారు చిత్ర యూనిట్. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్, శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.