ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్.. షూట్ అప్పటినుంచే !

Published on Sep 27, 2021 9:23 pm IST

‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ – స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో రానున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించి సెట్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. జూబ్లీహిల్స్ లోని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే తమ సినిమా సెట్ ను నిర్మిస్తున్నామని.. సినిమాలో కీలక భాగం ఈ సెట్ లోనే ఉంటుందని.. కొరటాల శివ రీసెంట్ గా ఒక టీవీ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ సెట్ వర్క్ వచ్చే నెల సెకెండ్ వీక్ లో పూర్తి అవుతుందట. అందుకే.. అక్టోబర్ మూడో వారం నుంచి ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక కొరటాల శివ స్క్రిప్ట్‌ లో ఎన్టీఆర్ కొన్ని కీలక మార్పులు చెప్పారని.. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ లో ఆ మార్పుల పై వర్క్ చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని.. ఎన్టీఆర్ ఫుల్ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :