చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ డేట్స్ మధ్య గ్యాప్ అంతేనా ?

చిరు, బాలయ్య సినిమాల రిలీజ్ డేట్స్ మధ్య గ్యాప్ అంతేనా ?

Published on Nov 26, 2022 1:25 AM IST


టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తూ దూసుకెళ్తున్నారు. అయితే లేటెస్ట్ గా బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుండి ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ రిలీజ్ అయి అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది. ఇక గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ చేస్తున్న వీరసింహా రెడ్డి మూవీ నుండి కూడా నేడు జై బాలయ్య సాంగ్ రిలీజ్ అయి సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక చిరు మూవీకి దేవిశ్రీ, అలానే బాలకృష్ణ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ రెండు సినిమాలని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండడం విశేషం.

అయితే మ్యాటర్ ఏమిటంటే, 2023 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ రెండు బడా మూవీస్ కేవలం ఒకే ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా వీటిలో వాల్తేరు వీరయ్య జనవరి 12న అలానే వీరసింహా రెడ్డి జనవరి 13న విడుదల కానున్నాయనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మొత్తంగా దీనిని బట్టి చూస్తే రాబోయే సంక్రాంతికి అటు బాలకృష్ణ, ఇటు చిరంజీవి ల సినిమాల మధ్య భారీ బాక్సాఫీస్ పోరు జరుగనుననట్లు తెలుస్తోంది. అయితే పక్కాగా ఈ రెండు సినిమాలు అదే తేదీల్లో విడుదలవుతాయా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం ఆయా సినిమాల యూనిట్స్ నుండి అఫీషియల్ గా ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు