మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పెద్ది’ జూన్ 25న విడుదల చేయనున్నట్లు బుచ్చిబాబు అనౌన్స్ చేశారు. ఐతే, అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ సినిమాని జూన్ 25వ తేదీని లాక్ చేశారు. ఇప్పుడు అదే డేట్ కి ‘పెద్ది’ రాబోతుంది. నిజానికి అంతకుముందు మే 1న ‘లెనిన్’ మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. ‘పెద్ది’ కోసం వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ చరణ్ కోసం అఖిల్ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక లెనిన్ విషయానికి వస్తే.. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్ లో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట.
అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ సినిమా పై మాత్రం మంచి హైప్ ఉంది.
