మహేష్ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు – శ్రద్ధాదాస్

Published on May 29, 2022 7:23 pm IST

శ్రద్ధా దాస్ టాలీవుడ్ లో ప్రస్తుతం లేచింది మహిళా లోకం చిత్రం లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా లో ఒక వీడియో ను పోస్ట్ చేయడం జరిగింది. సర్కారు వారి పాట చిత్రం లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కళావతి పాటకు వీడియో ను చేయడం జరిగింది. ఈ వీడియో లో శ్రద్దా దాస్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మేరకు ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ, పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

కళావతి తన ప్రస్తుతం ఫేవరేట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ పాటను లూప్ లో వింటూనే ఉన్నట్లు తెలిపింది. ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉన్నారు అని అన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ నటి నటించిన K3 కోటికొక్కడు జూన్ 17, 2022న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది.

సంబంధిత సమాచారం :