వైరల్ అవుతోన్న “లేచింది మహిళా లోకం” టీమ్ వీడియో

Published on May 24, 2022 4:00 pm IST

టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్, ప్రస్తుతం తన తదుపరి తెలుగు చిత్రం లేచింది మహిళా లోకం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తాజాగా ఒక వీడియో ను షేర్ చేశారు. సెట్స్ లో ఫన్నీ ఇన్సిడెంట్ ను వీడియో ద్వారా తన అభిమానులతో పంచుకుంది. సినిమా సెట్స్‌లో మొబైల్ నెట్‌వర్క్‌తో తన సహ నటులతో కలిసి సమస్యలను ఎదుర్కొంటున్న వీడియోను ఆమె పోస్ట్ చేసింది.

ఈ వీడియో ఫన్నీగా కనిపిస్తుంది మరియు నెట్‌వర్క్‌ను కనుగొనడంలో వారి కష్టాన్ని ప్రదర్శిస్తుంది. కొద్ది సేపటికే ఆ వీడియో వైరల్‌గా మారింది. లేచింది మహిళా లోకంలో లక్ష్మీ మంచు, అనన్య నాగళ్ల, సుప్రీత, హరి తేజ, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్, కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి శృతిరంజని సంగీత దర్శకురాలు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :