సాహో భామ మరో హిట్ కొట్టిందిగా

Published on Sep 12, 2019 9:29 am IST

ఈఏడాది భారీ హైప్ క్రియేట్ చేసిన చిత్రాలలో సాహో ఒకటి. నాలుగు భాషలలో భారీ ఎత్తున విడుదలైన సాహో అన్నిచోట్ల నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ భాషలలో సాహో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఐతే అనూహ్యంగా హిందీలో ఈ చిత్రం హిట్ మూవీ గా నిలిచింది. అక్కడ సాహో రెండు వారాలకు గాను 130కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీనితో సాహో చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన శ్రద్దా కపూర్ బాలీవుడ్ లో ఓ మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.

సాహో చిత్రంలో శ్రద్దా యాక్షన్ సన్నివేశాలతో పాటు, గ్లామర్ తో అలరించింది. ఇక తాజాగా ఆమె నటించిన ఛిచ్చోరే చిత్రం కూడా మంచి విజయం వైపుగా దూసుకెళుతుంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కిన ఛిచ్చోరే యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ బాలీవుడ్ లో మంచి స్పందన దక్కించుకుంటుంది. ఈ చిత్రం ఐదురోజులు గాను 54కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శ్రద్దా తో పాటు ఈ చిత్రంలో శుశాంత్ సింగ్ రాజ్ పుత్ తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి నటించారు. ఈ చిత్ర విజయంతో శ్రద్దా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నట్లయ్యింది.

సంబంధిత సమాచారం :

More