సైనా నెహ్వాల్ బయోపిక్ లో స్టార్ హీరోయిన్ !

26th, April 2017 - 09:44:17 AM


భారతీయ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ వరల్డ్ నెం. 1 సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు అమోల్ గుప్త ఈ బయోపిక్ ను డైరెక్ట్ చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ చేయనున్నారు. దర్శకుడు అమోల్ ఒక టెన్నిస్ క్రీడాకారిణిగా శ్రద్దా కపూర్ అయితే బాగుంటుందని, ఆమె మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను ప్రాజెక్టులోకి తీసుకున్నారట.

ఈ విషయంపై మాట్లాడిన శ్రద్దా కపూర్ ‘సైనా నెహ్వాల్ పాత్ర చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మాయిలు ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఏదో ఒక దశలో టెన్నిస్ ఆడే ఉంటారు. సైనా ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కూడ’ అన్నారు. అలాగే ఈ విషయంపై స్పందించిన సైనా నెహ్వాల్ కూడా శ్రద్దా కపూర్ లాంటి టాలెంటెడ్ నటి తన పాత్రను చేయడం ఆనందంగా ఉందని అన్నారు. నిర్మాత భూషణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.